సోగ్గాడితో మరోఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హిట్ అయిందంటే చాలు ఆ దర్శకుడికి వెల్లువలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని అందుకుంటున్నాడు నూతన దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’తో దర్శకుడిగా పరిచయం అయిన ఇతగాడితో నాగార్జున మరో సినిమా చేయబోతున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కథ..కథనంలో వైవిధ్యం... నాగార్జున గెటప్ కొత్తగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ఈ సినిమా విషయంలో నాగార్జున కూడా అలాగే ఫీలయ్యాడు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తనని కొత్తగా చూపించాడనీ, తనతో మంచి డైలాగ్స్ చెప్పించాడని నాగార్జున పలు ఇంటర్వ్యూలలో అన్నారు. కల్యాణ్‌కృష్ణ ఆయా పాత్రలను రూపొందించిన తీరు, వాటిని నడిపించిన విధానం తనకి చాలా బాగా నచ్చిందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే.. కల్యాణ్‌కృష్ణ టేకింగ్ స్టైల్ నచ్చడంతో ఆయనకి మరో అవకాశాన్ని ఇవ్వడానికి నాగార్జున రెడీ అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనున్నట్టు సమాచారం.