అందరికీ నచ్చే అబ్బాయి కథే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ విష్ణు హీరోగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెనె్నల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మిస్తున్న చిత్రం ‘మా అబ్బాయి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
‘నా కెరీర్‌లో ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. నా మార్కెట్ కంటే భిన్నంగానే బడ్జెట్ పెట్టిన నిర్మాత బలగ ప్రకాశరావు కథను బాగా నమ్మారు. కొత్త కథ కాదుగాని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇప్పటివరకు రాని స్క్రీన్‌ప్లేతో రూపొందిన సినిమా ఇది. ఇక మా అబ్బాయి అనే మాటను తరచుగా వింటుంటాం, వాడుతుంటాం. అలాంటి ఓ కామన్ అబ్బాయి కథే ఇది. తప్పకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా అద్దంపడుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే తన ఫ్యామిలీకి ఉన్న ఓ సమస్యను హీరో ఎలా పరిష్కరించాడన్నదే ఈ కథ. సోషల్ మెసేజ్‌తో ఉండే ఈ కథ హైదరాబాద్‌లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు కుమార్ వట్టి అద్భుతమైన కథను రూపొందించాడు. దానికి తగ్గట్టుగా చిత్రీకరణ కూడా ఉంటుంది. కచ్చితంగా నా కెరీర్‌కు మా అబ్బాయి మంచి బ్రేక్‌నిస్తుందన్న నమ్మకం వుంది. ఇక ఈ సినిమా తర్వాత మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దాంతోపాటు పెద్ద బ్యానర్స్‌లో కూడా చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పారు.

- శ్రీ