రోబో 2.0 టీజర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్, క్రేజీ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం ‘రోబో 2.0’. 2010లో వచ్చిన రోబో చిత్రం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రోబో 2.0 ను రూపొందిస్తున్నారు. 350 కోట్ల భారత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తికావచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కొంత ప్యాచ్‌వర్క్‌తోపాటు ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలోనే వీటిని పూర్తిచేస్తారని తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే చిత్రాన్ని సెప్టెంబర్ 29న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధవౌతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్సన్ నటిస్తోంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది.