త్రివిక్రమ్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం విడుదలకు సిద్ధవౌతోంది. ఇప్పటికే ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతున్నారు. ముఖ్యంగా కాటమరాయుడు పాటలకు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ నటించే సినిమాకోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో వీరి కాంబినేషన్‌కు క్రేజ్ ఏర్పడింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే ఈ హ్యాట్రిక్ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మెగా ఫ్యాన్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకోసం ఫిలిమ్ సిటీలో భారీ వ్యయంతో ఆఫీస్ సెట్‌తోపాటు ఇంటి సెట్‌ను వేస్తున్నారట. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో పవన్‌కు జోడీగా అనూ ఇమాన్యుయల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌నుండి ప్రారంభం కానుంది.