వేడుక చూద్దామంటున్న చైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య పూర్తిగా రూట్ మార్చాడు. సాదా సీదా సినిమాలు చేస్తే ఇక లాభం ఉండదని గ్రహించిన ఈ అక్కినేని హీరో తన సినిమాల్ని పూర్తి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అలా చేసి గతంలో ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి వాటితో మంచి విజయాలనందుకుని ఇప్పుడు కూడా అదే పంథాని ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం చైతు కల్యాణ్‌కృష్ణతో ఒక ప్రాజెక్టు, కృష్ణ మరియముత్తుతో ఒక సినిమా చేస్తున్నాడు. వీటిలో ముందుగా ప్రారంభమైన కళ్యాణ్‌కృష్ణ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేగాక తాజాగా టీమ్ ఈ సినిమాకి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారట. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొదటినుండి కుటుంబ కథ చిత్రంగా చెప్పబడుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.