సెన్సార్‌లో కాటమరాయుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న పవన్‌కల్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’ సెన్సార్ తేదీని ఫిక్స్ చేసుకుంది. సినీ సర్కిల్స్ సమాచారం ప్రకారం మార్చి 15న సెన్సార్ కార్యక్రమం జరగనుంది. అలాగే ఇటలీ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా షూటింగ్ మొత్తం ముగియనుంది. అందుకే చిత్ర యూనిట్ ఇంతకుముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి ముగింపు దశకు తీసుకొచ్చింది. సినిమా 24న రిలీజ్ కానుండటంతో ఇప్పటినుండే ప్రచార కార్యక్రమాల జోరును కూడా పెంచారు టీమ్. ఆడియోలో ఒక్కోపాటను విడుదల చేస్తూ అభిమానుల్ని హుషారెత్తిస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ‘జివ్వు జివ్వు’ అనే పాట కూడా రిలీజై సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇక ఆడియో వేడుక ఎలాగూ లేదు కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని ప్రకటించారు. కానీ అది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కిశోర్‌కుమార్ పార్థసాని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.