ఎన్టీఆర్‌తో ఐటెం సాంగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గ్లామర్ భామ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్‌లు కొట్టేస్తూ.. మరోవైపు యువ హీరోల సినిమాలను వదలకుండా దూసుకుపోతోంది. ఇప్పుడు ఈమెకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇలా హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ మరోవైపు ఐటెం సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట! ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా... ఎన్టీఆర్? ‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకువ’ సినిమాలో రకుల్ ఈ సాంగ్ చేయడానికి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈమధ్య ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్స్‌తో ఐటెం సాంగ్ చేయిస్తూ తన క్రేజ్‌ని ఇంకాస్త పెంచుకునే పనిలో పడ్డాడు. జనతాగ్యారేజ్‌లో కాజల్‌తో పక్కాలోకల్ అంటూ హంగామా చేసిన ఎన్టీఆర్, ఈసారి రకుల్‌తో మరో క్రేజీ ఐటెం సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నాడట! బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈనెల 15 నుండి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.