అమెరికాలో గ్రీన్‌కార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత్రుఘ్న రాయపాటి, స్ట్ఫోనీ జోసెలిన్ ప్రధాన తారాగణంగా రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహర్.ఆర్.నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రమ్స్ మాట్లాడుతూ- వీసా తీసుకొని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి కథనమే గ్రీన్‌కార్డ్ చిత్రమని, గత 15 సంవత్సరాలుగా తాము అమెరికాలో గమనించిన పరిస్థితులను ఆధారం చేసుకొని ఈ కథను రాసుకున్నానని తెలిపారు. పిల్లలను అమెరికాకు పంపాలనుకునే తల్లిదండ్రులకు ఈ కథ అంకితం చేస్తున్నామని, అక్కడ మన పిల్లలు ఎలా ఉంటున్నారనే విషయం చాలామందికి తెలియదని, ఆ విషయాలను కూడా ఈ చిత్రంలో చర్చించామని, వారం పది రోజుల్లో ఆడియో విడుదల చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకువస్తామని తెలిపారు. 90 శాతం ఈ సినిమాను అమెరికాలో చిత్రీకరించామని, ఇక్కడనుండి అమెరికాకు వెళ్లేవారు గ్రీన్‌కార్డ్‌కోసం ఎన్ని ఇబ్బందులు పడతారు అనే కానె్సప్టుతో ఈ చిత్రం రూపొందించారని, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుందని కథానాయకుడు శత్రుఘ్న రాయపాటి తెలిపారు. కార్యక్రమంలో నటుడు చలపతిరావు విశేషాలను తెలిపారు. రెబెకా, మిల్లీ, స్వీటెన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:కూ, హెన్నీ ప్రిన్స్, ప్రణయకుమార్, కెమెరా:నవీన్, నాగశ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్:మోహన్, రామారావు, నిర్మాతలు:శ్రీనివాసగుప్తా, మోహన్.ఆర్.నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి, దర్శకత్వం:రమ్స్.