ఇదీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన దర్శకుడిగా పేరుపొందిన సంజయ్‌లీలా భన్సాలీ రాణి పద్మావతి కథను వెండితెరకెక్కించాలని నిర్ణయించారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలసి ఆయన చిత్ర నిర్మాణానికి ముందుకువచ్చారు. గత ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభించారు. ఈఏడాది నవంబర్ 17న సినిమాను రిలీజ్ చేయాలన్నది ఆయన లక్ష్యం. మెవార్ రాజు రాణారవల్ రతన్‌సింగ్ సతీమణి, చిత్తోర్‌కోట్ రాణి పద్మావతికి సంబంధించిన చారిత్రక విషయాలకు కొంత కల్పనతో చిత్ర కథను సిద్ధం చేశారు. ఇందులో రాణి పద్మావతిగా దీపిక పదుకొనే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్, రాజా రతన్‌గా షాహిద్‌కపూర్ నటిస్తున్నారు. ప్రఖ్యాత నేపథ్యగాయని శ్రేయాగోషాల్ ఇందులో పాటలు పాడుతున్నట్లు స్వయంగా ట్వీట్ చేశారు. జైపూర్‌లోని నెహర్‌గఢ్ కోటలో అద్భుతమైన సెట్‌లు వేశారని, తాను అద్భుతమైన పాటలు పాడానని ఆమె సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. లతామంగేష్కర్ ఓ పాటపాడారని చెబుతున్నప్పటికీ ఎవరూ ధ్రువీకరించలేదు. శ్రేయ ట్వీట్ చేసిన సమయంలోనే జైపూర్ కోటలో తాము అనుమానిస్తున్నట్లు ఖిల్జీ, పద్మావతిల రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని రాజ్‌పుత్ కర్ణిసేన అనుమానించి దాడికి పాల్పడింది. కాగా జైపూర్ దాడితో మనస్తాపం చెందిన భన్సాలీ ఆ తరువాత చిత్ర నిర్మాణాన్ని నిలిపివేయాలని భావించారు. అయితే బాలీవుడ్‌సహా అంతా ఆయనకు మద్దతు తెలపడంతో మళ్లీ షూటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి దాడి జరగడంతో ‘పద్మావతి’ కథ తెరకెక్కుతుందా అన్నది అనుమానమే.