హీరోనవుతానని చిరు చెప్పారు - శరత్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన పాత్రల్లో మెప్పించగల నటుడిగా, నెగెటివ్ పాత్రల్లో తనదైన సత్తా చాటి హీరోలకు ధీటుగా గుర్తింపు తెచ్చుకున్నవాడిగా పేరు పొందారు శరత్‌కుమార్. ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటాయి. ముఖ్యంగా ‘కాంచన’ సినిమాలో హిజ్రా పాత్రలో నటించి మెప్పించిన శరత్‌కుమార్ చాలా గ్యాప్ తరువాత తెలుగులో ‘నేనోరకం’ సినిమాలో నటిస్తున్నాడు. సాయిరామ్ శంకర్ హీరోగా సుదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా శరత్‌కుమార్‌తో ఇంటర్వ్యూ...
* చాలా గ్యాప్ తరువాత తెలుగులో చేస్తున్నారు?
- అవును.. ‘బన్నీ’ సినిమా తరువాత ‘జీనియస్’ సినిమా చేశాను. ఇప్పుడు నేనోరకం సినిమాలో నటిస్తున్నాను. ఇది నేను కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. నాకు మంచి పాత్రలు రావడంలేదు.. అందుకనే ఇంత గ్యాప్ వచ్చిందేమో.
* అంటే అవకాశాలు రావడం లేదా?
- ఏ పాత్ర పడితే ఆ పాత్ర నేను చేయలేను. ఈ పాత్రలో శరత్‌కుమార్ అయితే బాగా ఉంటుందని అనిపించాలి. దానికితోడు నాకు కూడా ఆ పాత్ర రెగ్యులర్‌గా కాకుండా భిన్నంగా ఉంటేనే ఓకే చేస్తా.
* ఈ సినిమాలో నటించడానికి కారణం?
- చాలా రోజుల తరువాత తెలుగులో డైరెక్ట్ సినిమా చేశాను. చాలా గొప్పగా వచ్చింది. సన్నివేశాల్లో సీరియస్‌నెస్ తీసుకురావడానికి నా పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్రస్తుతం సొసైటీలో యూత్ ఎలా ఉన్నారు? అసలు రిలేషన్‌షిప్ అంటే ఏమిటి అనేది ఇందులో చూపిస్తాం. మంచి యాక్షన్‌తోపాటు సొసైకీకి ఉపయోగపడే మెసేజ్ కూడా ఇందులో ఉంది. ఫ్యామిలీ అంతా తప్పక చూడాల్సిన చిత్రం.
* టాలీవుడ్‌లో మీకు ఎవరు సన్నిహితులు?
- ఇక్కడ అందరూ స్నేహితులే.. కలిసినప్పుడు అందరం సరదాగా మాట్లాడుకుంటాం. అయితే నాకు చిరంజీవి అత్యంత సన్నిహితుడు. ఆయన సినిమాల్లో నటించాను.
‘గ్యాంగ్‌లీడర్’ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా తరువాత నువ్వు పెద్ద హీరో అవుతావని ఆయన చెప్పాడు. ఆ తరువాత నేను నిజంగానే మంచి హీరోగా ఎదిగాను.. ఆయనెప్పుడూ పాజిటివ్‌గానే ఉంటారు.
* మళ్లీ ఆయన సినిమాలో చేస్తారా?
- ఎందుకు చేయను. నిజానికి ఆయన 150వ సినిమాలో చిన్న పాత్రయినా ఉందా అని అడిగా. ఈ విషయంలో వినాయక్‌ను కూడా నా కోసం చిన్న పాత్ర ఉంటే చూడమని చెప్పా, కానీ కుదరలేదు. ఒకవేళ గ్యాంగ్‌లీడర్ సీక్వెల్ చేస్తే అందులో నటిస్తా.
* ఈమధ్య తమిళంలో కూడా ఎక్కువగా
సినిమాలు చేయడంలేదు, ఎందుకు?
- ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నాను కాబట్టి.. సినిమాలకు కాస్త బ్రేక్ వచ్చింది. మంచి కథ కుదిరితే తప్పకుండా మళ్లీ వరుసగా సినిమాలు చేస్తా.
* తమిళ రాజకీయాల గురించి ఏం చెబుతారు?
- తమిళనాడు రాజకీయాలు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఎపుడు ఎం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నిజంగా అది బాధాకరమే.
* ఆ సంఘటన పట్ల ఎలా స్పందిస్తారు?
- నిజంగా అది బాధాకరమే. మహిళలకు ఎక్కడ రక్షణ లేదన్నది నిజమే. అది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు సమాజంలో కూడా మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. వీటిని అరికట్టే ప్రయత్నం కూడా గట్టిగా జరగాలి. సాటి మనుషులుగా ఇది ఖండించాల్సిన విషయం.
* పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళతారా?
- ప్రస్తుతం పార్టీకి సంబంధించిన విషయాల గురించి చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అన్నది ఇంకా ఆలోచన జరగాల్సి ఉంది.
* నెక్స్ట్ సినిమాలు?
- ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. దాంతో పాటు తమిళంలో కూడా ఓ సినిమా ఉంటుంది.

-శ్రీ