వివాదాల చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదమూడో శతాబ్దానికి చెందిన రాణి పద్మావతి చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘పద్మావతి’ చిత్రం వివాదాల చిచ్చులో చిక్కుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో షూటింగ్ నిర్వహిస్తుండగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి జరిగిన సంఘటన ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న సమయంలో మరోసారి ఆ చిత్రబృందంపై దాడి జరిగింది. మహారాష్టల్రోని కొల్హాపుర్ జిల్లాలోని పన్వాలాకు 20 కిలోమీటర్ల దూరంలోని మసాయ్ పీఠభూమిలో షూటింగ్ కోసం వేసిన సెట్‌ను మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దాదాపు 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన సెట్ పూర్తిగా కాలిపోయింది. కాస్టూమ్స్, సినిమా షూటింగ్‌కు సంబంధించిన సామాగ్రి దగ్ధమైంది. అయితే చిత్ర దర్శకుడు, సిబ్బంది ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో వచ్చిన 40 మంది దుండగులు సెట్‌కు నిప్పుపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. వచ్చీరావడంతోనే రాళ్లు విసిరి భయోత్పాతం సృష్టించిన దుండగులు ఆ తరువాత సెట్‌కు నిప్పుపెట్టారు. కాగా చిత్రబృందం ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దర్శక నిర్మాతలు కోరితే రాత్రిపూట కూడా రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోంమంత్రి దీపక్ కసార్కర్ హామీ ఇచ్చారు. కాగా చిత్రంపై అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలేతప్ప ఇలా దాడులకు పాల్పడటం సరైన చర్య కాదని సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి వినోద్ తవ్డే అభిప్రాయపడ్డారు. కాగా గత జనవరిలో జైపూర్‌లోని నెహార్‌గఢ్ కోటలో ‘పద్మావతి’ చిత్రంలోని ఓ పాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా సెట్‌పై శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు దాడి చేసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై చేయిచేసుకున్నారు. ఆ దాడితో మనస్తాపం చెందిన సంజయ్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పారు. ఆ రాణి పద్మావతికి సంబంధించిన అంశాలను వక్రీకరించారన్నది రాజ్‌పుత్ కర్ణిసేన ఆరోపణ. కానీ అలాంటిదేమీ లేదని, వదంతులను నమ్మవద్దని సంజయ్ బృందం కోరింది. చివరకు ఇరుపక్షాల మధ్య అవగాహన కుదరడంతో ఒకటిన్నర నెల విరామం తరువాత షూటింగ్ మొదలైంది. అయితే రాజస్థాన్ నుంచి షూటింగ్ స్పాట్‌ను మహారాష్టక్రు మార్చారు. వారం రోజులుగా కొనసాగుతున్న షూటింగ్ ఈనెల 23వ తేదీవరకు జరగాల్సి ఉండగా మంగళవారం రాత్రి అనుకోని సంఘటన జరిగింది. అయితే తాజా సంఘటనకు బాధ్యులెవరన్నది తెలియలేదు. రాజ్‌పుత్ కర్ణిసేనకు ఈ దాడితో సంబంధం ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.