కన్నుల్లో నీ రూపమే సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, తేజస్వి ప్రకాష్ జంటగా బిక్స్ దర్శకత్వంలో ఎ.ఎస్.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బాసాని రూపొందించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో సింధూరపువ్వు కృష్ణారెడ్డి, ఆర్.పి.పట్నాయక్ సంయుక్తంగా బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- తమ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైందని, దర్శకుడు కథ చెప్పినదానికన్నా సినిమాను చక్కగా రూపొందించాడని, సాకేత్ మ్యూజిక్ హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
మంచి లవ్‌స్టోరీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు బిక్స్ తెలిపారు. కార్యక్రమంలో కథానాయకుడు నందు, సాకేత్, సాయికార్తీక్, ఇ.రాజవౌళి, రామాచారి, సురేష్ కొండేటి, జబర్దస్త్ రాము పాల్గొని విశేషాలను తెలిపారు.