రేపు పిచ్చిగా నచ్చావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందించిన ఈ సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడారు. దాదాపు ఒక సంవత్సరం నుండి సినిమా యూనిట్ అందరం కలిసి ఓ కుటుంబంలా ప్రయాణించి ఈ సినిమాను ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయంలోనే పూర్తిచేశామని, మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా వుంటాయని, సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని తెలిపారు.
కథ వినగానే నిర్మాత ఈ సినిమా రూపొందించడానికి ముందుకు వచ్చారని, కృష్ణా జిల్లాలో 46 రోజులపాటు ఏకధాటిగా సినిమా షూటింగ్ చేశామని, కొత్తవాళ్లతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కథలోనే క్రియేట్ అవ్వడం ఓ వైవిధ్యంగా వుంటుందని దర్శకుడు వి.శశిభూషణ్ అన్నారు. ఒకరిని నమ్మితే వారికోసం ఎంతదూరమైన వెళతాం అన్న కథనంతో రూపొందిన ఈ సినిమాను 108 థియేటర్లలో విడుదల చేస్తున్నామని, అచ్చమైన తెలుగు ప్రేమకథగా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పుచ్చా రామకృష్ణ, చిత్ర యూనిట్ విశేషాలు తెలిపారు.