29న రానున్న సీతమ్మ.. రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి రూపొందించిన చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, కుటుంబాలలో వుండే వినోదానికి పెద్దపీట వేసి రూపొందించామని తెలిపారు. రాజ్‌తరుణ్ పాత్ర హైలెట్‌గా వుండే ఈ చిత్రంలో అర్తన అనే కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నామని, నవ్యమైన కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ భారీ ఖర్చుతో చిత్రీకరించామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వారు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకం వుందని వారన్నారు. రణధీర్, రాజారవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్ర్తీ, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: విశ్వ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.