షూటింగ్‌కు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమాకు అంతా సిద్ధమైంది. తొలి షెడ్యూల్ కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. హైదరాబాద్‌లో షెడ్యూల్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈనెల 22 వరకు షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. బాలకృష్ణ ఆరంభంలోనే ఫైట్ సన్నివేశాల్లో పాల్గొననున్నారు. ఊహకు కూడా అందని విధంగా ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎలా ఉండబోతోందా అన్న అంచనాలు మొదలయ్యాయి. స్టార్ ఇమేజ్ స్థాయి పెద్దదే కనుక రిజల్ట్ ఎలా ఉండబోతోందా అని ఆలోచిస్తున్నారు. పూరి కూడా సినిమా ఏ మాత్రం అభిమానుల్ని నిరుత్సాహపరచకుండా అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందని చెప్పడం, బాలకృష్ణ తన పాత్ర ఫ్యాన్స్‌కు కన్నుల పండువులా వుంటుందని వివరించడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మొదటి షెడ్యూల్ అనంతరం రెండవ షెడ్యూల్‌ను ఇంగ్లాండ్‌లో నెల రోజులపాటు జరపనున్నారు.