ట్రైలర్ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి-ద కంక్లూజన్’ చిత్రం ట్రైలర్ దృశ్యకావ్యంగా సాగిపోయింది. 2 నిమిషాల 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో జలధారలు, ప్రకృతి సోయగాలు, అనుష్క అందచందాలు, కోటలు, యుద్ధసన్నివేశాలు, అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ చెప్పిన డైలాగులు అదరగొట్టాయి. అతిస్పష్టంగా కనిపించే సన్నివేశాలు, అద్భుతమైన గ్రాఫిక్స్, నయనానందకరంగా ఉన్న దృశ్యాలు కళ్లు తిప్పుకోనివ్వలేదు.
తొలిచిత్రం ముగింపులో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సందేహం అలాగే ఉండగా ఈ ట్రైలర్‌లో మరింత ఆసక్తి రేపే సంభాషణ వినిపిస్తుంది. ఒకవైపు ప్రేమ సన్నివేశాలు, మరోవైపు యుద్ధ దృశ్యాలు కనువిందు చేస్తాయి. 4కె, విఎఫ్‌ఎక్స్ టెక్నాలజీ నైపుణ్యం అంతా ఇందులో కనిపిస్తుంది. ‘అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అన్న డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ‘నువ్వు నా ప్రక్కనున్నంతవరకు నన్ను చంపేవాడు ఉండడు’ అన్న బాహుబలి మాటలు ఆసక్తిని రేపుతాయి. తొలిభాగంలో మాహిష్మతి రాజ్యాన్ని కొంత చూపిస్తే ఇందులో మిగతా ప్రాంతంతోపాటు అనుష్క ఏలుబడిలో ఉన్న కుంతల సామ్రాజ్యాన్ని చూపించారు. రౌద్రరూపంతో ఉన్న రానా, కట్టప్పల హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.