ఆత్మకథ రాస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా తమ జీవిత కథలు పుస్తకాలుగా రావాలని కోరుకునేవారు ఉంటారు. కొందరైతే తన జీవిత కథను తానే రాసుకుంటారు కూడా. చిత్ర పరిశ్రమకి సంబంధించి కొంతమంది కథానాయకులు.. నాయికల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో వచ్చాయి. మరికొంతమంది ఆత్మకథను రాసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. అలాంటి నాయికల జాబితాలో కంగనారనౌత్ కూడా చేరబోతోంది. ఇటీవల ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ఏ రోజుకు ఆరోజు పోటీ పెరిగిపోయే బాలీవుడ్‌లో కథానాయికగా నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి కంగనా అడుగుపెట్టింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ఒక్కో మెట్టును అధిరోహిస్తూ తన స్వశక్తితో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ప్రయాణంలో ఆమెకి ఎన్నో అనుభవాలు.. మరెన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితులను ఆమె ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ స్థానానికి చేరుకుంది. ఆ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ, తాను ఒక పుస్తకాన్ని రాయనున్నట్టు కంగనారనౌత్ చెప్పుకొచ్చింది. మరి ఈమె పుస్తకం రాస్తే మరిన్ని సంచలనాలు రేపుతుందో లేదో.