ప్రభాస్ ముందు బలాదూర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్-2 ట్రైలర్ బ్రహ్మాండంగా ఉందంటూ నిన్న ట్వీట్లతో మోతెక్కించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆ సినిమాలో కథానాయకుడు ప్రభాస్‌పై శుక్రవారం పొగడ్తలు కురిపించారు. పనిలోపనిగా టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలకు పరోక్షంగా చురకలు అంటించాడు. టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ స్టార్లమని, అంతవారము, ఇంతవారమంటూ బాలీవుడ్‌లో సినిమాల్లో హీరోలుగా నటించి, ఘోరంగా విఫలమై చివరికి తెలుగు సినిమాలకే పరిమితమైపోయినారంటూ తెలుగు హీరోలను కొందరిని విమర్శించారు. అంతటితో ఆగకుండా అలాంటి టాలీవుడ్ స్టార్లు, బాహుబలి ట్రైలర్ చూశాక ప్రభాస్ కాలిగోటినందుకోవడానికి రెండున్నర జన్మలు ఎత్తాల్సి వుంటుందని తెలుసుకుంటారని ఎద్దేవ చేశాడు. రాంగోపాల్ వర్మ ట్వీట్లు పెద్దదుమారానే్న రేపుతున్నాయి. సామాజిక మాధ్యమం ఆధారంగా సమకాలీన అంశాలపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసే రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు ఆ మధ్య చిరంజీవి, నాగబాబులపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బాహుబలి ట్రైలర్ సినిమాకు అమ్మమ్మలా వుందని నిన్న వ్యాఖ్యనించిన ఆయన, నేడు ప్రభాస్ ఇమేజ్‌ను అమాంతం పెంచేస్తూ ప్రభాస్ ముందు తెలుగు హీరోలంతా బలాదూర్ అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి తరువాత టాలీవుడ్‌లో పవర్‌ఫుల్, మోస్ట్ పాపులర్ స్టార్‌గా ప్రభాస్ ఎదిగిపోయాడని, ముంబైలోని ఐదు అతి పెద్ద కంపెనీలు ఆయనతో సినిమాలు రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒకరితో ఒకరు పోటీపడుతుండడమే దీనికి నిదర్శనమని వర్మ తెలిపారు. బాహుబలి-2 ట్రైలర్ వ్యూస్ సంఖ్యను చూసిన టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారోనని భయంగా వుందని ఆయన ఎద్దేవా చేశారు. సంచలనానికి మారుపేరుగా నిలిచిన వర్మ వ్యాఖ్యానాలతో టాలీవుడ్‌లో కూడా పలు ప్రకంపనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ వర్మ ఎవరిని ఉద్దేశించి ఇంత పెద్ద వ్యాఖ్యానాలు చేశాడో కానీ, మీడియాకు మాత్రం పెద్దపనే చెప్పాడు.