సస్పెన్స్ థ్రిల్లర్‌గా నటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవదీప్, కావ్యాశెట్టి జంటగా లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల రూపొందిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ద్రిల్లర్ చిత్రం ‘నటుడు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- డిఫరెంట్ కథ, కథనాలతో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో మానవ సంబంధాల నేపథ్యంలో కథనం సాగుతుందని, ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథను ట్రీట్ చేసిన విధానం కొత్తగా ఉంటే, ఆ సినిమాలు విజయం సాధిస్తున్నాయని, అదేకోవలో ‘నటుడు’ కూడా చేరుతుందని తెలిపారు. సబ్జెక్ట్ సస్పెన్స్‌తో సాగుతూ, ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుందని, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మానవ సంబంధాలతో వ్యాపారం చేసే ఓ కుర్రాడి కథతో ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ సినిమాలో ప్రేమలను అమ్మడం, కొనడం అనే కొత్త కానె్సప్టు వుంటుందని, నవదీప్‌కు ఈ చిత్రంతో నటుడిగా మంచి పేరు వస్తుందని తెలిపారు. అనుకున్న బడ్జెట్‌లోనే రూపొందిన ఈ సినిమాలో కథానాయకుడు పాత్ర యువత ఆలోచనలకు సమాంతరంగా సాగుతుందని, తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. నాగినీడు, సూర్య, సత్య, ఆశీష్ గాంధీ, జియా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వాసు, సంగీతం:జయసూర్య, ఎడిటింగ్:నాగిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.