31న వస్తున్న డోర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సుర ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన ఆడియోకు చక్కటి స్పందన వస్తోందని, పాటలన్నీ అర్థవంతమైన సాహిత్యంతో ట్రెండీగా వున్నాయని ప్రశంసలు లభిస్తున్నాయని, కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కానె్సప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. నవ్యమైన కథతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ పంచే విధంగా చిత్రంలోని సన్నివేశాలు వుంటాయని, ఇక నయనతార అంటేనే చక్కటి అభినయానికి పెట్టింది పేరని, ఆమెకు అగ్రహీరోలతో సమానమైన ఇమేజ్ వుందని అన్నారు.
అత్యుత్తమ నిర్మాణ విలువలతో డోరా సినిమాను తెరకెక్కించామని, తెలుగు, తమిళ, భాషల్లో మార్చి 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.