వేసవికి రానున్న ఉంగరాల రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఉంగరాల రాంబాబు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవి కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ- అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్న ఈ చిత్రం సునీల్ గత చిత్రాలకన్నా హైస్టాండర్డ్‌లో వుంటుందని, ఆయన నుంచి ప్రేక్షకులు ఏ అంశాలు ఆశిస్తారో అవన్నీ వుంటాయని తెలిపారు. సర్వేష్ మురారి కెమెరా పనితనం హైలెట్‌గాసాగే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను, ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సునీల్ తరహా కామెడీ ఎంటర్‌టైనర్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని రూపొందించామని, ఔట్ అండ్ ఔట్ కామెడీ కథలో కుటుంబ విలువలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. మియాజార్జ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, ఆశీష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభా స్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, నల్లవేణు, అనంత్, హేమంత్, వౌళిక, మిధున ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, రెహమాన్, మాటలు:చంద్రమోహన్ చింతాడ, సమర్పణయునైటెడ్ కిరీటి మూవీస్, నిర్మాత:పరుచూరి కిరీటి, దర్శకత్వం:కె.క్రాంతిమాధవ్.