6 కోట్లమంది చూశారు.. బాహుబలి ట్రైలర్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ కథానాయకుడిగా ఎస్. ఎస్. రాజవౌళి రూపొందిస్తున్న చిత్రం ‘బాహుబలి-ద కంక్లూజన్’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిని యూట్యూ బ్, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవారి సంఖ్య రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారత చరిత్రలో అతి తక్కువ సమయంలో ఎక్కువమంది చూసిన ట్రైలర్‌గా ఇది రికార్డు నమోదు చేసింది. బాహుబలి ది బిగినింగ్ చిత్రానికన్నా, బాహుబలి ది కంక్లూజన్‌కు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన దాదాపు 48 గంటల్లో 65 మిలియన్ల క్లిక్స్ సాధించి ఓ చరిత్ర సృష్టించింది బాహుబలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు జవాబుగా ఎక్కడైనా ట్రైలర్‌లో ఏదైనా విషయం దొరుకుతుందా అని చూసినవారే మళ్లీ మళ్లీ చూడటం విశేషం. ఇప్పటివరకూ విడుదలైన ట్రైలర్స్‌లో ఇంత తక్కువ సమయంలో ఇన్ని క్లిక్స్ సాధించిన చిత్రం మరేదీ లేకపోవడం పెద్ద రికార్డుగా మారింది. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్లు కూడా ఒప్పుకుంటున్నారు. బాహుబలి ది బిగినింగ్ చూసినవారందరూ తమ మనసులో వున్న ప్రశ్నకు సమాధానాన్ని ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇన్ని మిలియన్ల క్లిక్స్ రావడంవెనుక రాజవౌళి ఇంపాక్ట్ కూడా బలంగా పనిచేస్తోంది. ఈ సంవత్సరంలోనే అత్యం త ఎదురుచూస్తున్న సినిమాగా బాహుబలి అవతరించింది. 2 నిమిషాల 20 సెకండ్లపాటు సాగిన ఈ ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన కథనం ఎక్కడా రివీల్ కాకుండా ముఖ్యమైన సన్నివేశాలను మాత్రమే కూర్చి విడుదల చేశారు. యూట్యూబ్‌లోనే దాదాపు 22 మిలియన్ల క్లిక్స్ వచ్చాయంటే దీనిపై అంచనాలు ఏవిధంగా వున్నాయో తెలుస్తుంది. ట్రైలర్ అధికారికంగా విడుదలయ్యాక బాలీవుడ్ స్టార్స్ షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్ లాంటివాళ్లు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు లభిస్తున్న ఆదరణకు ఆశ్చర్యపోతున్నారు. గతంలో షారుక్‌ఖాన్ నటించిన ‘రాయిస్’ చిత్రం ట్రైలర్‌ను 24 గంటల్లో 20.8 లక్షలమంది చూసినదే రికార్డు కాగా దానిని కేవలం గంట వ్యవధిలో బాహుబలి దాటేసింది. కబాలీ సినిమా ట్రైలర్‌ను చూసినవారి సంఖ్య 1.8 కోట్లు కాగా కేవలం ఒక్కరోజులోనే దానిని బాహుబలి దాటేసింది. చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ గణాంకాలు చెబుతున్నాయి.