సర్దార్ డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూడడంతో ఆ సినిమా కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన సంపత్‌కుమార్‌కు తీరని నష్టం వాటిల్లింది. ఆ తరువాత ఈ చిత్ర నిర్మాతలు తమ తదుపరి చిత్రానికి సంబంధించిన హక్కులు తనకే ఇస్తామంటూ మాట ఇచ్చి తప్పడంతో డిస్ట్రిబ్యూటర్ సంపత్‌కుమార్ నిరాహారదీక్ష సాగిస్తున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్ ఫిలిమ్‌ఛాంబర్ వద్ద ఆయన ఈ దీక్షను చేస్తున్నారు. సర్దార్ చిత్ర నిర్మాత ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రాన్ని నిర్మించారని, ఈ సినిమాకు సంబందించిన కృష్ణా జిల్లా హక్కులను తనకు కాకుండా వేరే వ్యక్తికి అధిక ధరకు అమ్ముకున్నారని, ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని ఆయన ఈ దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. పవన్‌కల్యాణ్ ఈ విషయంలో తనకు న్యాయం చేసేవరకు దీక్ష ఆగదని సంపత్ స్పష్టం చేశాడు.