పిల్లా.. నీవల్లా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్, మోనికాసింగ్, షాలూ చారసియా ప్రధాన తారాగణంగా బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిశోర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఓ పిల్లా నీవల్లా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కిశోర్ మాట్లాడుతూ- చక్కని వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందించామని, లవ్, కామెడీ, యాక్షన్ జోనర్స్ హైలెట్‌గా వుంటాయని, ఇప్పటికే విడుదలచేసిన ట్రైలర్‌కు, పోస్టర్లకు మంచి స్పందన లభించిందని తెలిపారు. ఆడియో విశేషంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, క్లాస్, మాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఓ వైవిధ్యమైన కథ, కథనాలపై మంచి అభిరుచితో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఆయన తెలిపారు. సూర్య శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:కృష్ణమదినేని, కరుణాకర్, కెమెరా:షోయెబ్ అహ్మద్.కె.ఎం., ఎడిటింగ్:అనీల్ కింతాడ, సంగీతం:మధు పొన్నాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: కిశోర్.