నాన్న దుస్తులు, చైన్ వాడా.. -నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ ముఖ్యపాత్రల్లో కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో మా సినిమా నెం.1గా నిలిచిందని అన్నారు.‘దసరాబుల్లోడు’ 1971లో విడుదలై సంచలన విజయం సాధించిందని, అలాంటి సినిమా చేయాలనే కోరిక మనసులో వుండిపోయిందని, ఈ సినిమాతో ఆ కోరిక తీరిందన్నారు. బంగార్రాజు గెటప్‌కోసం నాన్నగారి దుస్తులు, వాచి, చైను అన్నీ వేసుకున్నానన్నారు. అందుకేనేమో ఆయన ఆశీర్వాదం ఈ సినిమాకు దొరికిందని, 600 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు 5 కోట్లు, రెండవ రోజు 5 కోట్లు, మూడో రోజు 5 కోట్ల షేర్‌ను సాధించిందన్నారు. అయినా నేనీ రికార్డులను పట్టించుకోనని, ఈ సినిమాలో రెండు పాత్రలు చేయడం ఆనందంగా వుందన్నారు. అనూప్ మంచి మ్యూజిక్ అందించాడని అన్నారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ బంగార్రాజు లాంటి క్యారెక్టర్ ప్రతి పల్లెటూర్లలో చూడొచ్చునని, నిజ జీవితంలోని వ్యక్తులను గమనించి, ఈ చిత్రాన్ని తెరకెక్కించానని అన్నారు. లావణ్యాత్రిపాఠీ మాట్లాడుతూ నాగార్జున లాంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు.