ప్రేక్షకులకు పిచ్చిగా నచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య, నందు ముఖ్య పాత్రల్లో వి.శశిభూషణ్ దర్శకత్వంలో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై కమల్‌కుమార్ పెండెం నిర్మించిన పిచ్చిగా నచ్చావ్ చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. చేతన, సంజీవ్ నటనతో ఆకట్టుకున్నారని, ముఖ్యంగా నాగబాబు పాత్ర సినిమాను మలుపుతిప్పిందని, అన్ని ఏరియాలనుండి మంచి టాక్ వస్తోందని, ఇలాంటి చిన్న సినిమాల్ని ఆదరించినప్పుడే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని అన్నారు. హీరోయిన్ చేతన మాట్లాడుతూ.. ఈ చిత్రం ఒక ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, ప్రస్తుత జనరేషన్ అటు కెరీర్ పట్ల, ఇటు ప్రేమ పట్ల ఎలాంటి ఆలోచనలతో ఉన్నారన్నది ఇందులో చెప్పామని అన్నారు. దర్శకుడు శశిభూషణ్ మాట్లాడుతూ ‘రియలిస్టిక్ కథాంశంతో తీసే ఈ చిత్రానికి కొత్తవాళ్లైతేనే న్యాయం చేస్తారని, చేతన, సంజీవ్‌లను ఎంచుకున్నానని, కామెడీ, పాటలు, సందేశం బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పుచ్చా రామకృష్ణ, హీరో సంజీవ్ పాల్గొన్నారు.