కమల్ సోదరుడు చంద్రహాసన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్ సోదరుడు చంద్రహాసన్ (82) ఈనెల 18న గుండెపోటుతో మరణించారు. లండన్‌లోని తన కుమార్తె అనూ హాసన్‌వద్ద నివసిస్తున్న ఆయన భార్య గీతామణి కూడా ఈమధ్యే మరణించారు. చంద్రహాసన్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ సంస్థ తరఫున వ్యవహార బాధ్యతలు నిర్వహించేవారు. ముఖ్యంగా కమల్‌హాసన్‌తో‘నలదమయంతి’, ‘విరుమంద’, ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ వంటి చిత్రాల్ని నిర్మించారు. దాంతోపాటు ప్రస్తుతం రూపొందుతున్న ‘శభాష్‌నాయుడు’ చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే విశ్వరూపం-2 చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనుల్లో ఉన్నారు. చంద్రహాసన్ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.