16 ఓ ప్రయోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సంక్లిష్ట్భరితమైన కథనం తీసుకుని అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన దర్శకుడు కార్తీక్ నరేన్ చిత్రాన్ని వైవిధ్యంగా డీల్ చేశాడు. ఇటువంటి మంచి కథనం వున్న ఈ సినిమా ఓ ప్రయోగం లాంటిది అని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలింస్ పతాకంపై రెహమాన్, ప్రకాష్ విజయ్, రాఘవన్, అశ్వినీకుమార్ ప్రధాన తారాగణంగా చదలవాడ పద్మావతి అందించిన ‘16’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ- ఎక్కువ థియేటర్లు దొరక్కపోయినా, మంచి కథనం వుండడంతో సినిమా విడుదల చేశామని, అయితే మంచి ఆదరణ పొందుతూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతూ 2కోట్లకుపైగా వసూలు చేసిందని తెలిపారు. ప్రయోగాత్మకంగా రూపొందించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ చిత్రం నిరూపించిందని దర్శకుడు కొత్త దర్శకులకు ప్రేరణగా నిలిచాడని, కథ వైవిధ్యంగా వుండి స్క్రిప్ట్ సరికొత్తగా వుంటే ఎంత ఖర్చు అయినా పెట్టవచ్చని ఈ చిత్రం చెప్పిందని లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో వినోద్, కె.ఎస్.నాగేశ్వరరావు, కిశోర్‌రెడ్డి, అంజి శ్రీను, డార్లింగ్ స్వామి, టి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.