‘గామా’ ఉత్తమచిత్రం బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్లుగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్ ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12న భారీ స్థాయిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గామా అవార్డ్స్ అధినేత కేసరి మాట్లాడుతూ రెండేళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అవార్డు వేడుకలను ఈసారి మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకూ కేవలం సంగీత విభాగానికి మాత్రమే అవార్డులు ఇచ్చామని, ఈసారి బెస్ట్ మూవీ కేటగిరీని ప్రవేశపెడుతున్నామని, ఈ కేటగిరీలో ‘బాహుబలి’ చిత్రానికి అవార్డు అందిస్తున్నామన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ గత ఏడాది ‘మనం’ చిత్రానికి ఈ అవార్డు అందుకున్నానని, ఇప్పుడు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ఆనందంగా వుందని అన్నారు. శ్రీలేఖ మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నానని, వచ్చే ఏడాదిలోనైనా ఈ అవార్డును అందుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ‘బాహుబలి’ నిర్మాత శోబు యార్లగడ్డ, సుమన్, దీపు తదితరులు పాల్గొన్నారు.