క్లీన్ యుతో బ్లాక్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్ కథానాయకుడిగా మాజిన్ మూవీ మేకర్స్ పతాకంపై జోషి దర్శకత్వంలో సయ్యద్ నిజాముద్దీన్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘బ్లాక్‌మనీ’ (అన్నీ కొత్తనోట్లే). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- మోహన్‌లాల్ తెలుగులో వరుస హిట్లతో జోరుమీద ఉన్నారని, ఆ జోరు ఈ చిత్రంతో మరింత పెరుగుతుందన్న నమ్మకం వుందని, మీడియా నేపథ్యంలో ఓ టీవీ చానెల్ కెమెరామెన్‌గా మోహన్‌లాల్ నటన వైవిధ్యంగా వుంటుందని తెలిపారు. వృత్తిపరమైన సంఘర్షణలు, సంబంధ బాంధవ్యాల అంశం చుట్టూ కథ, కథనం తిరుగుతుందని, మలయాళంలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం:రతీష్ వేగా, కెమెరా:అండీరాజ్ శేఖర్, సంభాషణలు:వెనె్నలకంటి, దర్శకత్వం:జోషి.