సోలోగావస్తే.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోలోగా వస్తే విజయం తథ్యం అంటూ వస్తున్న ‘కాటమరాయుడు’ ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత శరత్ మరార్ అన్నారు. సినిమా ఈనెల 24న విడుదల కానుందని, ట్రైలర్ ఎంత ఆదరణ పొందిందో సినిమా అంతకన్నా ఎక్కువ విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా రూపొందిన కాటమరాయుడు ఈనెల 24న విడుదలకు ముస్తాబైంది. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి విజయం లభించిందని, ‘జివ్వు జివ్వు’ పాట ప్రతిఒక్కరి పెదవులమధ్య వినిపిస్తుందని ఆయన అన్నారు. మిలియన్లలో పాటలకు వ్యూస్, లైక్స్ వచ్చాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లో 24న కాటమరాయుడు పండుగ మొదలుకానుందని తెలిపారు. నేడు సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, నిర్మాత:శరత్ మరార్, దర్శకత్వం:కిషోర్ పార్థాసాని.