ఉగాదికి చైతూ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు వరుసగా హిట్లు ఖాతాలో వేసుకున్న నాగచైతన్య, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కల్యాణ్‌కృష్ణ ప్రాజెక్టు. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయన’లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు నాగచైతన్యను కూడా పూర్తి రొమాంటిక్ యాంగిల్‌లో చూపించనున్నాడు. నాగచైతన్య ఇంతకుముందులా కాకుండా నటనలోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ పూర్తిగా స్టైల్ మార్చి పరిణితి కలిగిన నటనను ప్రదర్శిస్తుండటంతో ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఉత్సుకత కాస్త ఎక్కువైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్‌లుక్‌ను ఈనెల 29వ తారీఖున ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ప్రస్తావనలో వుంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు సైతం ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు అక్కినేనటి టీమ్.