బాలీవుడ్ బాణ్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్‌తో దుమ్ము రేపిన దువ్వాడ జగన్నాథ సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. ‘సరైనోడు’ సినిమా తరువాత మాస్ సినిమాలతో దుమ్ము రేపాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో వంద కోట్ల మార్కెట్‌పై కనే్నశాడు అల్లు అర్జున్. దానికోసం బాలీవుడ్ టచ్ ఇవడానికి రెడీ అయ్యారట! ఇప్పటికే ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ని బాలీవుడ్ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యతో కంపోజ్ చేయిస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గ్లామర్ భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మేలో విడుదల చేస్తారట.