హైపర్ దర్శకుడితో కొత్త సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కాటమరాయుడు హంగామా మొదలైంది. పాటల్లో పవన్‌కల్యాణ్ హీరోయిన్‌తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న దృశ్యం అలరిస్తోంది. ఇతర పాటల్లోని దశ్యాలకు సంబంధించిన స్టిల్స్ తాజాగా విడుదల చేశారు. కాగా పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 24న విడుదలకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. డాలి దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా తరువాత పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్‌లో రూపొందే ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమా కాకుండా పవన్ మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది? ఆ దర్శకుడు ఎవరో కాదు, సంతోష్ శ్రీనివాస్! ‘కందిరీగ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్ ఆ తరువాత ఎన్టీఆర్‌తో ‘రభస’, రామ్‌తో ‘హైపర్’ చిత్రాలను రూపొందించాడు. లేటెస్టుగా పవన్‌కు ఓ కథ వినిపించాడని, కథ నచ్చడంతో పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది? ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తాజా సమాచారం. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందట! త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.