ఒక్క సినిమాకు 175 కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా రెమ్యూనరేషన్ విషయంలో అమీర్‌ను కొట్టేవాడే లేడు. కేవలం ఒక్క సినిమాకు ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని షాక్ ఇచ్చాడు. నిజంగా ఈ విషయం బలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా బాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్న అమీర్‌ఖాన్ భిన్నమైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తున్నాడు. ‘పికె’ సినిమాతో సంచలన కలెక్షన్స్ రాబట్టిన అమీర్, తాజాగా దంగల్ చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమా అన్ని రకాల బిజినెస్‌లు కలుపుకుని దాదాపు 700 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా సమయంలో అమీర్ తనకు రెమ్యూనరేషన్ వద్దని, సినిమా బాగా ఆడి మంచి లాభాలొస్తే అందులో వాటా ఇవ్వమని అడిగాడట. దానికి సదురు నిర్మాతలు సరే అనడంతో.. ఇప్పుడు అమీర్‌ఖాన్‌కు ఏకంగా 175 కోట్లు దక్కాయి. ఒక రకంగా ఇండియన్ సినిమా చరిత్రలో హీరోల రెమ్యూనరేషన్‌లో అమీర్‌దే రికార్డ్! మరి ఆయన రికార్డ్‌ను ఇప్పట్లో కొట్టే హీరో ఉండడేమో! ప్రస్తుతం అమీర్‌ఖాన్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.