షారుక్ గ్యారేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన జనతా గ్యారేజ్‌పై కింగ్ ఖాన్ షారుక్ మనసు పారేసుకున్నాడా? ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడా? అంటే అవుననే సమాచారం. తెలుగులో గత ఏడాది రిలీజైన ఈ చిత్రం దాదాపు 100కోట్లుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కామెన్‌మాన్‌ను ఆదుకునేందుకు ఓ గ్యారేజ్ ఉంటే ఎలా వుంటుంది అన్న పాయింట్‌తో కొరటాల శివ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన, మోహన్‌లాల్ అండర్ కవర్ పెర్‌ఫార్‌మెన్స్ సినిమాకి ఎస్సెట్స్ అయ్యాయి. ఎమోషన్ ప్రధానంగా ఉండడంతో విజయవంతం అయింది. అందుకే ఈ అంశాలన్నీ షారుక్‌ను ఆలోచింపజేశాయట. ఇటీవల హైదరాబాద్ వచ్చిన షారుక్, జనతా గ్యారేజ్ చూసి వెంటనే రీమేక్ చేయాలని అన్నాడట. ఇందులో ఎమోషన్లకి బాద్‌షా బాగా కనెక్ట్ అయిపోయాడని చెబుతున్నారు. మొత్తానికి ఇలా చేస్తే ఫ్లాప్‌ల్లో వున్న షారుక్‌కి కాస్తంత ఊరటనిచ్చే పని అయినట్లే కదా!