మేలో ఆడియో వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్ చిత్రంతో బిజీగా వున్నారు. ఆయన అభిమానులు కోపంగా ఉన్నారు. మురుగదాస్‌తో సినిమా మొదలై ఇన్నాళ్లైనా ఫస్ట్‌లుక్ కనీసం టైటిల్ ఏమిటో చెప్పకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారట. ఇలాంటి తరుణంలోనే అభిమానులను మచ్చిక చేసుకోవడానికి ఓ వార్త బయటికి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను, టైటిల్ ప్రకటన, ఆడియో విడుదల కార్యక్రమ తేదీలు నిర్ణయించారట. ఫస్ట్‌లుక్‌ను ఉగాది రోజున విడుదల చేయనున్నారు. అప్పుడే టైటిల్ కూడా ఏమిటో ప్రకటిస్తారట. అలాగే ఆడియో వేడుకను మే 28న హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు జరుపుతున్నారు. గతంలో కూడా ఇలాంటి వార్తలే వినిపించి ఆ తరువాత పుకార్లు అని తేలిపోయిన నేపథ్యంలో పరిశ్రమలో వినిపిస్తున్న ఈ కథనాలపై క్లారిటీకోసం వేచి చూడాల్సిందే. ఇకపోతే రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, తమిళ దర్శక నటుడు ఎస్.కె.సూర్య విలన్‌గా నటిస్తుండడం ఈ సినిమాకు పెద్ద విశేషం.