నిర్మాత రాజ్ కందుకూరికి బి.నాగిరెడ్డి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతేడాది ఘనవిజయం సాధించిన సినిమాల్లో ‘పెళ్లిచూపులు’ ఒకటి. అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఊహకందని రీతిలో పదింతలు వసూళ్లను సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. చిన్న సినిమా ఎలా ఉండాలి అంటే అందరూ ‘పెళ్లిచూపులు’లా ఉండాలి అన్నంతగా ఈ సినిమా పాపులర్ అయింది. మంచి కథతో, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయగా రాజ్‌కందుకూరి నిర్మించారు. అంత మంచి విలువలున్న సినిమాను నిర్మించినందుకుగాను రాజ్ కందుకూరికి విశిష్ట పురస్కారం బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు దక్కనుంది. బి.నాగిరెడ్డి కుమారుడు, విజయ వాహిని స్టూడియోస్ వ్యవహార బాధ్యతలు చూసుకుంటున్న బి.వెంకట్రామిరెడ్డి గత ఆరు సంవత్సరాలనుండి మంచి కుటుంబ విలువలున్న సినిమాలను నిర్మించే నిర్మాతలకు ఈ అవార్డును బహూకరిస్తున్నారు. కాగా 2016వ సంవత్సరానికిగాను రాజ్ కందుకూరికి ఏప్రిల్ 16న ఈ అవార్డును రాజమండ్రిలో అందజేయనున్నారు.