విడుదలలోనూ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ చిత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. సీక్వెల్స్‌కు విజయం చేకూరదు అన్న ఓ బలమైన నమ్మకం పరిశ్రమలో పాతుకుపోవడంతో ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలన్న కృతనిశ్చయం ఆయనలో కనబడుతోంది. సీక్వెల్‌గా వచ్చిన ఏ సినిమా అయినా తొలి సినిమా సాధించినంత విజయాన్ని సాధించకపోవడం గమనార్హం. ఎందుకంటే, తొలి సినిమా చూసిన ప్రేక్షకులు అంతే అంచనాలతో థియేటర్‌కు రావడంతో ఆ అంచనాలు సినిమా అందుకోకపోవడంతో సీక్వెల్స్ హిట్ బాట పట్టలేదు. చరిత్రను తిరగరాయడంలో బాహుబలికి ఎటూ మంచి రూట్ వుంది కనుక ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకంతో యూనిట్ ఉన్నారు. ‘బాహుబలి-2’ ది కంక్లూజన్ మరో ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక దాదాపుగా వంద మిలియన్ల వ్యూస్ సాధించి నెంబర్‌వన్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రానికి ఇంత ఆదరణ లభించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల కావలసిన థియేటర్ల లిస్టు కూడా బాహుబలిలాగే భారీగా ఉంది. దాదాపు 6500 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ భారతీయ చిత్రం ఇప్పటివరకూ ఇన్ని స్క్రీన్లపై విడుదల సందర్భంగా ప్రదర్శించలేదని, మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్‌బాల తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. యూ ట్యూబ్‌లో వంద మిలియన్లకుపైగా వ్యూస్ దాటిపోయి బాహుబలి ట్రైలర్ దూసుకుపోతోంది. రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా ప్రదాన తారాగణంగా నటించిన ఈ చిత్రం త్వరలో అభిమానులకు విందు చేయనుంది. ఆడియోను ఈ నెల 26న, సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. బాహుబలి అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నారు. అభిమానుల్లో అటు పరిశ్రమకు చెందినవారు, ఇటు రాజకీయ రంగానికి చెందినవారు ఉండడం ఈ సినిమాకు మరో విశేషం.