కమెడియన్ సరసన నయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లా మర్ భామ నయనతార ఈమధ్య విభిన్నమైన సినిమాలు చేస్తూ బిజీగా వుంటోంది. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ అవకాశాలు పట్టేస్తోంది. ఇప్పటికే ‘మయూరి’, ‘డోరా’ వంటి చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు, ప్రస్తుతం యువ హీరోలతో జత కట్టడానికి ఇష్టపడుతోంది. తాజాగా నయనతార నిర్ణయం అందరికీ షాకిచ్చింది. స్టార్ హీరోల సినిమాలకే డేట్స్ లేవని చెప్పే ఈ అమ్మడు, ఓ కమెడియన్ సరసన హీరోయిన్‌గా నటించడానికి ఓకె చెప్పడం విశేషం! తమిళ కమెడియన్ సూరి హీరోగా టర్న్ అవుతూ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుందట. అందుకే నయనతారను ఎంపిక చేశారు. ఈ పాత్ర నచ్చడంతో నయన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తన పాత్రకు ప్రధాన్యత వుంటే చాలు కమెడియన్ అయినా సరే ఓకె అంటోంది నయనతార.