సిద్ధమవుతున్న సినీమహల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని ప్రధాన తారాగణంగా కళానిలయ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘సినీమహల్’ (రోజూ 4 ఆటలు). లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- సినిమా టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందని, సినిమా సమ్‌థింగ్ స్పెషల్ కానె్సప్ట్‌తో రూపొందని తెలిపారు. ఈ పాటలకు మంచి ఆదరణ లభించిందని, కొత్త తరహాగా సాగే కథనంతో ఆద్యంతం ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:దొరై సి.వెంకట్, సంగీతం:శేఖర్ చంద్ర, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, పాటలు:సుద్దాల చైతన్యకృష్ణ, నాగహనుమాన్, నిర్మాత:బి.రమేష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రమేష్ వర్మ.