గురు కోసం బాక్సింగ్ నేర్చుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూ విభిన్నతకు మారుపేరుగా నిలిచి వరుస విజయాలనే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘గురు’. సుధా కొంగర దర్శకత్వంలో ఎన్.వై. ఫిలింస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా వెంకటేష్‌తో ఇంటర్వ్యూ...
గురు విడుదల ఆలస్యమైంది ఎందుకు?
నిజానికి సంక్రాంతి తరువాత వద్దామనే అనుకున్నాం. కానీ సినిమా వర్క్స్ కొన్ని మిగిలిపోవడంతోపాటు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని లేటైంది. సమ్మర్ రావడం బెటరే కదా.
ఈ సినిమా చేయడానికి కారణం?
నిజానికి హిందీలో ఈ సినిమా బాగా ఆడింది. ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. ముఖ్యంగా భిన్నమైన సినిమాలు చేయాలనే ఆలోచనకు అప్పుడే ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు రావడం, ఓకె చేయడం జరిగింది. ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి భిన్నమైన సినిమాలు చేసినపుడే ఆర్టిస్టుకు కొత్త ఉత్సాహముంటుంది.
దీనికోసం ట్రైనింగ్ తీసుకున్నారా?
సినిమా ఓకె తరువాత ఆరునెలలు రీసర్చ్ చేశాను, దాంతోపాటు బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకున్నాను. చూడగానే కోచ్‌లా కనిపించాలి కాబట్టి దానికి తగ్గట్టుగా బాడీని మెయింటైన్ చేశాను. నిజానికి అమ్మయిలను స్పోర్ట్స్‌వైపు పంపించడానికి మన ఇండియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపరు. కానీ వాళ్లను క్రీడలవైపు ఎంకరేజ్ చేస్తే ఎన్నో అద్భుతాలను చూడొచ్చు.
మీ పాత్ర గురించి?
ఇందులో నేను బాక్సింగ్ కోచ్‌గా కనిపిస్తాను. కాంప్రమైజ్ కాకుండా చాలా కఠినంగా వుండే శిక్షకుడిగా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం ఒక్కో సీన్ ఐదారుసార్లు రిహార్సల్స్ చేస్తున్నాను. నేను ఇదివరకు చేసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా భిన్నం. ఈ సినిమా ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను.
మీ కోస్టార్స్ గురించి?
చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు నటిస్తున్నారు. వారి డెడికేషన్ చూసి ఆనందం కలిగింది. నిజంగా ఎంతో రిస్క్ చేశారు. వాళ్లకు మంచి ఫ్యూచర్ వుంటుంది. దాంతోపాటు ఈ చిత్రంలో చాలామంది నిజమైన బాక్సర్లతోనే సినిమా చేశాము.
మీరు పాడిన పాట వైరల్ అయ్యింది?
నిజంగా హ్యాపీ కదా. ఎందుకంటే ఆ సాంగ్ ట్యూన్ వినగానే పాడాలనిపించింది. నాకు కరెక్ట్‌గా సింక్ అయినట్టుంది. భాస్కరభట్ల మంచి లిరిక్. సంతోష్ మంచి సంగీతాన్ని అందించాడు. ముఖ్యంగా తాగుబోతు వాళ్లపై వచ్చిన సాంగ్‌కు అన్నీ బాగా కుదిరాయి.
మరి భవిష్యత్తులో కూడా పాడతారా?
ముందు ఈ సినిమా రిలీజ్ అవనీండి. తరువాత చూద్దాం.
మీ కెరీర్‌లో 75 సినిమాలు చేశారు కదా, ఏమనిపిస్తుంది?
చాలా ఆనందంగా వుంది. ఈ 30 ఏళ్ల సినీ కెరీర్‌లో అన్నీ చూశాను. ముఖ్యంగా హీరోగా అనుకోకుండానే వచ్చాను. అలా వచ్చి ఇన్ని సినిమాలు పూర్తిచేశానంటే అది నిజంగా భగవంతుని సంకల్పమే.
మీ 75వ సినిమా ప్రత్యేకంగా వుంటుందా?
మనం అనుకుంటే అన్నీ జరగవుకదా. ఆల్రెడీ ఆ సినిమా గురించి ప్రకటించారు. కానీ అది కుదరలేదు. చూద్దాం ఏం జరుగుతుందో!
పూరి జగన్నాథ్‌తో సినిమా వుంటుందా?
ఇప్పటికే చర్చించుకున్నాం. పూరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నారు. అది అయిపోగానే మా సినిమా వుంటుంది.
‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా ఏమైంది?
అది స్క్రిప్ట్ సరిగ్గా కుదరలేదు. అందుకే దర్శకుడు కిశోర్ దాన్ని మార్చే పనిలో ఉన్నాడు. త్వరలోనే అది కూడా సిద్ధమవుతుంది.
గురు గురించి ఫ్యాన్స్‌కి ఏం చెబుతారు?
మా ఫ్యాన్స్ ఎప్పుడూ క్లారిటీతోనే ఉంటారు. నేను భిన్నమైన సినిమాలు చేస్తే వాళ్లకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో నేను రియల్ గెడ్డంతోనే కనిపిస్తాను. అది చూసి వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

- శ్రీ