సందేశంతో నరుూం భాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీ ఫిలింస్ పతాకంపై లక్ష్మీరవి సమర్పణలో ఎన్.టి. నాయుడు నిర్మాతగా, ఎల్.వి. నాయుడు టైటిల్ పాత్రలో బి.ఆర్. నాయుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నరుూం భాయ్’. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- నరుూం టైటిల్ పాత్రకు ఎల్.వి. నాయుడు సరిగ్గా సరిపోయాడని, ట్రైలర్ బాగుంది. కొత్త నిర్మాతలైనా సినిమాను బాగా తీశారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుం ది అన్నారు. హీరో ఎల్.వి.నాయుడు మాట్లాడుతూ- నిర్మాతలు నన్ను చూసి నరుూంలా వున్నావని అవకాశం ఇచ్చారని, నరుూం టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా చేయడం ఆనందంగా వుందని అన్నారు. నిజానికి నా కేరెక్టర్‌కు భిన్నమైన పాత్ర ఇదని, అయినా నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలి కాబట్టి చేస్తున్నానని, చెడుదోవ పడుతున్న యువతకి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. లక్ష్మీరవి మాట్లాడుతూ, ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయని, సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయని అన్నారు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.