ఏంజిల్‌తో అనే్వష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ అనే్వష్, హెబ్బాపటేల్ జంటగా శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ఏంజెల్. భువనసాగర్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పళని దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో నాగ అనే్వష్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా నాగ అనే్వష్ మాట్లాడుతూ- మంచి కథతో తెరకెక్కుతున్న ‘ఏంజెల్’ చిత్రంలో నటిస్తున్నాను. ‘వినవయ్యా రామయ్య’ తరువాత నేను చేస్తున్న రెండో చిత్రమిది. మొదటి చిత్రంలో వున్న మిస్టేక్స్‌ను ఈ చిత్రంతో సరిచేసుకుంటున్నాను. ఏంజెల్ సినిమా నా కెరీర్‌కు మంచి బ్రేక్‌నిస్తుందన్న నమ్మకం వుంది. అమ్మాయేమో దేవకన్యలా వుంటే, అబ్బాయి ఊరమాస్ లాంటి హీరో. అలాంటివారిమధ్య ఎలా ప్రేమ కుదిరింది, దానికోసం అబ్బాయి ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు బాహుబలి పళని అద్భుతంగా తెరకెక్కించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే తమాషా ప్రేమకథ ఇది. చిత్రీకరణ చివరి దశలో వుంది. మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నా’ అని అన్నారు.