ఉగాదికి రాంబాబు టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడుగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నట్లుగా యూనిట్ తెలియజేస్తోంది. నిర్మాత కిరీటి మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలతో ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నామని, త్వరలో ఆడియోను విడుదల చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. చాలాకాలం తర్వాత సునీల్ తరహా కామెడీతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేశామని, నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని తెలిపారు. కథలో కామెడీని పొందుపరిచి నవ్వించే ప్రయత్నం చేశామన్నారు. మియాజార్జ్ కథానాయికా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, వెనె్నల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల, రాజారవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, విజయ్‌కుమార్, నల్ల వేణు, మిర్చి హేమంత్, జెమినీ ప్రసాద్, మణిచందన్, మిథున తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.