చంద్రుడిలో ఉండే కుందేలు ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సిద్ధి వినాయక సెవెన్ హిల్స్ క్రియేషన్స్ పతాకంపై క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్‌దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’. వెంకట్‌రెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకట్‌రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా హిట్ అవుతుందని, బుల్‌గానిన్ సంగీతం, దాము నర్రావుల కెమెరా పనితనం హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. సినిమా ట్రైలర్ వైవిధ్యంగా ఉందని దర్శకుడు కొత్త నటీనటులతో మంచి నటన రాబట్టారని, మంచి విజయం సాధించాలని రాజ్ కందుకూరి ఆకాంక్షించారు. సినిమా మొదటినుండి చివరి వరకు మంచి ఫీల్‌తో సాగుతుందని, మంచి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారని నిర్మాత ధన శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో బుల్‌గానిన్, రచయిత చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పావనిరెడ్డి, పమేలా, రంగనాథ్, సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, సప్తగిరి, షకలక శంకర్, తా.రమేష్, కాదంబరి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, పాటలు: శ్రీమణి, కరుణాకర్, నిర్మాతలు: ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకట్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: విశ్వనాథ్, దర్శకత్వం: వెంకట్‌రెడ్డి ఉసిరిక.