బాలీవుడ్‌లో రీమేక్‌గా నారా రోహిత్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత డిసెంబర్ 30న రిలీజైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొంది మంచి చిత్రంగా నిలిచింది. హైదరాబాద్‌లోని ఒక యువకుడి నిజ జీవితంతలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా, శ్రీవిష్ణు మరొక కీలకమైన పాత్ర పోషించారు. భిన్నమైన కథ, ఆకట్టుకునే కథనమే ప్రధాన బలాలుగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ చిత్రంపై బాలీవుడ్ నిర్మాతల దృష్టిపడింది. రియలిస్టిక్‌గా నడిచే సినిమాలకు ఆదరణ బాగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్ణయించుకుందట. ఆ సంస్థ ఏది, సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు, నటీనటులెవరు అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.