పొల్లాచ్చిలో మేడమీద అబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, నిఖిలావిమల్ జంటగా జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై జి.ప్రజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. మలయాళంలో విజయవంతమైన ఒరువడక్కమ్ సెల్ఫీ చిత్రానికి రీమేక్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 16నుండి పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత చిత్ర విశేషాలు తెలుపుతూ.. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుందని, థ్రిల్లింగ్ అంశాలు సాగుతూ నరేష్ తరహా కామెడీ కూడా ఉంటుందని, కొత్త కథలో నరేష్‌ను చూడాలనుకునే వారికి ఈ సినిమా సమాధానం ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం పొల్లాచ్చిలో పలు అందమైన లొకేషన్లలో గ్రాండియర్‌గా షూటింగ్ చేస్తున్నామని, వచ్చేనెల 3వరకు ఇక్కడే జరగనుందని, మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్, కెమెరా: ఉన్ని ఎస్.కుమార్, సంగీతం: డి.జె.వసంత్, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.