గోలీసోడా కొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్, కారుణ్య, మహిమా అలేఖ్య ప్రధాన తారాగణంగా ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై హరిబాబు మల్లూరి దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ రూపొందించిన చిత్రం ‘సోడా గోలీ సోడా’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ప్రారంభోత్సవ సన్నివేశంపై నిర్మాత సత్య సంధుజ క్లాప్ ఇవ్వగా స్వామిగౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి నటుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. కొప్పుల ఈశ్వర్ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఓ మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెలాఖరునుండి ప్రారంభించి పాలకొల్లు, హైదరాబాద్‌ల్లో టాకీపార్టు పూర్తిచేస్తామని తెలిపారు. ఔట్‌డోర్ లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరుపుతామన్నారు. మంచి చిత్రాలను అందించాలన్న తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత సత్య సింధుజ అన్నారు. టైటిల్‌లోనే మంచి పవర్ ఉందని, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం వుందని కథానాయకుడు మానస్ తెలిపారు. కార్యక్రమంలో కారుణ్య, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.