ఉస్తాద్‌గా బాలయ్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతాడు పూరి అనే సందేహం అందరిలో మొదలైంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాకు ఎక్కువగా నెగిటివ్ టైటిల్స్ పెడతాడు.. అలాగే ఈ సినిమాకు కూడా నెగిటివ్ టైటిల్ పెడతారా అన్న సందేహాలు కలిగాయి. పైగా ‘టపోరి’ అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో బాలయ్య సినిమాకు ఆ టైటిల్ పెడుతున్నారా? అంటూ నందమూరి అభిమానుల్లో పలు సందేహాలు కలిగాయి. కానీ తాజాగా ఈ సినిమాకు ‘ఉస్తాద్’ అనే పేరును పెడుతున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కాబట్టి ఆయన ఇమేజ్‌కు సరిపోయేలా ఈ పేరు అయితే బెటర్ అనే ఉద్దేశంలో యూనిట్ ఉందట. మరి ఈ టైటిల్ అయినా ఫిక్స్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!